నిత్య పెళ్లికొడుకు అరెస్టు

ABN , First Publish Date - 2022-12-16T01:22:22+05:30 IST

మ్యాట్రిమొని వెబ్‌సైట్‌ ద్వారా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసి, డబ్బులు ఆభరణాలు దోచుకున్న నిత్య పెళ్లికొడుకుని కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను దక్షిణ డివిజన్‌ ఏసీపీ డాక్టర్‌ బి.రవికిరణ్‌, కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు, ఎస్‌ఐ కృష్ణయి గురువారం వెల్లడించారు.

నిత్య పెళ్లికొడుకు అరెస్టు

విజయవాడ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మ్యాట్రిమొని వెబ్‌సైట్‌ ద్వారా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసి, డబ్బులు ఆభరణాలు దోచుకున్న నిత్య పెళ్లికొడుకుని కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను దక్షిణ డివిజన్‌ ఏసీపీ డాక్టర్‌ బి.రవికిరణ్‌, కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు, ఎస్‌ఐ కృష్ణయి గురువారం వెల్లడించారు. తమిళనాడు, చిత్తురు సరిహద్దులో కావేరి రాజపురానికి చెందిన ఘట్టమనేని మనోహర్‌ అలియాస్‌ మనోహరన్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు. వివాహం అయిన తర్వాత మనస్పర్ధల కారణంగా భార్యతో విడిపోయాడు. ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఒంటిరిగా ఉన్న మహిళలను ట్రాప్‌ చేయడం మొదలుపెట్టాడు. విజయవాడకు చెందిన ఓ మహిళను ట్రాప్‌ చేశాడు. ఈ ఏడాది మార్చి నాలుగున ఆమెను మంగళగిరిలోని ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం ఎంజీ రోడ్డులో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె నుంచి రూ.5లక్షలు, ఆమె తమ్ముడు నుంచి రూ.2.5లక్షలు తీసుకున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి చిత్తూరు జిల్లాకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆమె కృష్ణలంక పోలీసులు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు చిత్తూరు జిల్లాలో మనోహరన్‌ను అరెస్టు చేశారు. విచారించగా మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌, చెన్నై, రాజమండ్రి నగరాల్లో అనేక మోసాలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయలను నిరుద్యోగుల నుంచి వసూలు చేశాడు. కృష్ణలంక పోలీసులు అతడిని గురువారం కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - 2022-12-16T01:22:55+05:30 IST