సూర్యారావుపేటలో అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు హాస్టల్‌

ABN , First Publish Date - 2022-12-07T00:50:29+05:30 IST

సూర్యారావుపేటలోజూట పలు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులు అర్ధరాత్రి వేళల్లో బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. విషయం తెలుసుకున్న సూర్యారావు పేట సీఐ జానకిరామయ్య ఆయా విద్యార్థినీ, విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇప్పించారు.

సూర్యారావుపేటలో అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు  హాస్టల్‌

వన్‌టౌన్‌, డిసెంబరు 6 : సూర్యారావుపేటలోజూట పలు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులు అర్ధరాత్రి వేళల్లో బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. విషయం తెలుసుకున్న సూర్యారావు పేట సీఐ జానకిరామయ్య ఆయా విద్యార్థినీ, విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇప్పించారు. మెట్రో హాస్పిటల్‌ సమీపంలో ఉన్న బాయ్స్‌, గర్ల్స్‌ హాస్టల్‌లోని ఇద్దరు విద్యార్థుల బర్త్‌డే సందర్భంగా రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి సుమారు 10 మంది విద్యార్థులు కేకులు కట్‌ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థినీ, విద్యార్థులు రోడ్లపై కేరింతలు కొడుతూ స్థానికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నైట్‌ డ్యూటీలో ఉన్న సీఐ జానకిరామయ్య సంఘటన ప్రాంతానికి వెళ్లి వారి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. మరోసారి ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హాస్టళ్ల నిర్వాహకులతో సమావేశం

సూర్యారావుపేట పరిధిలో బాయ్స్‌, గర్ల్స్‌ హాస్ట ల్‌ నిర్వహకులతో సీఐ జానకిరామయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్‌ విద్యార్థినీ, విద్యార్థులు నిబంధనలను ఉల్లంఘించి రాత్రి 10గంటల తరువాత రోడ్లపై తిరిగితే అందుకు హాస్టల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సింహరాయుడు వీధి, పీసాపాటివారి వీధి, గోవిందరాజులు నాయుడు వీధి, వెంకటరత్నం వీధి, విష్ణువర్థన్‌రావు వీధుల్లోని పలు హాస్టళ్ల వద్దకు రాత్రివేళల్లో ఇతర ప్రాంతాల యువకులు ఆగడాలు సృష్టిస్తున్నట్టు ఫిర్యాదులందుతున్నాయన్నారు. అక్కడ ఏదైనా సమస్యలు తలెత్తితే దానికి బాధ్యులు మీరేనంటే హెచ్చరించారు.

Updated Date - 2022-12-07T00:50:30+05:30 IST