హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-03-05T06:12:50+05:30 IST

హత్య కేసులో నిందితుడి అరెస్టు

హత్య కేసులో నిందితుడి అరెస్టు

నందిగామ రూరల్‌, మార్చి 4: నందిగామ ఓసీక్లబ్‌ రోడ్డులో బుధవారం వరి సింహాద్రి అలియాస్‌ అప్పాజీని హత్య చేసిన గుత్తి విజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట హాజరుపరిచారు. శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ నాగేశ్వరరెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. తెనాలికి చెందిన గుత్తి విజయ్‌, కందుకూరి ఉష కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. వరి సింహాద్రితో ఉషకు పరిచయం కావడంతో ఆమె అతనితో కలిసి ఉంటుందని, దాన్ని తట్టుకోలేక సింహాద్రిని గుత్తి విజయ్‌ హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసును ఛేదించిన సీఐ కనకారావు, ఎస్సై సురేష్‌కు రివార్డులు అందిస్తామని డీఎస్పీ తెలిపారు.


Read more