AP News: వైసీపీ ఎంపీ భరత్‌పై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలి: ముప్పాళ్ల

ABN , First Publish Date - 2022-10-20T19:38:04+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్ర పై దాడి చేయడం దుర్మార్గమని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.

AP News: వైసీపీ ఎంపీ భరత్‌పై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలి: ముప్పాళ్ల

విజయవాడ (Vijayawada): అమరావతి (Amaravathi) రైతుల పాదయాత్ర (Padayatra)పై దాడి చేయడం దుర్మార్గమని, వైసీపీ ఎంపి మార్గాని భరత్ (Margani Bharat) చర్యలపై సీఎం జగన్ (CM Jagan) క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు (Muppalla Nageswara Rao) డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు రైతులను రెచ్చ గొట్టాలని‌ చూస్తున్నారని, మహిళపై రాళ్లు వేయించి‌ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అమరావతి ఏకైక రాజధాని అనేది తమ జాతీయ సమావేశాల్లో తీర్మానం చేశామని చెప్పారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై పోరాటం ‌కొనసాగిస్తామని, దేశంలో కమ్యూనిస్టు ప్రాబల్యాన్ని పెంచేలా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Updated Date - 2022-10-20T19:38:04+05:30 IST