రాయచోటి మున్సిపల్ కమిషనర్‌పై దాడికి నిరసన
ABN , First Publish Date - 2022-06-26T06:46:13+05:30 IST
రాయచోటి మునిసిపల్ కమిషనర్ ఆర్.రాంబాబుపై వైసీపీ కౌన్సిలర్ దాడిని ఖండిస్తూ గుడివాడ మునిసిపల్ కార్యాలయం వద్ద మునిసిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, పారిశుధ్య కార్మికుల, సచివాలయ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

గుడివాడ టౌన్ : రాయచోటి మునిసిపల్ కమిషనర్ ఆర్.రాంబాబుపై వైసీపీ కౌన్సిలర్ దాడిని ఖండిస్తూ గుడివాడ మునిసిపల్ కార్యాలయం వద్ద మునిసిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, పారిశుధ్య కార్మికుల, సచివాలయ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మునిసిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ, మునిసిపల్ సిబ్బంది, సచివాలయ ఎంప్లాయీస్ ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని 95 శాతం పరిష్కారం దిశగా పనిచేస్తున్నారన్నారు. సేవలందించే అధికారులపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.