-
-
Home » Andhra Pradesh » Krishna » mugisina netradhana pakshothavalu-NGTS-AndhraPradesh
-
ముగిసిన నేత్రదాన పక్షోత్సవాలు
ABN , First Publish Date - 2022-09-10T06:19:44+05:30 IST
ముగిసిన నేత్రదాన పక్షోత్సవాలు

పెనమలూరు, సెప్టెంబరు 9 : ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబరులో జరిగే నేత్రదాన పక్షోత్సవ కార్యక్రమం స్థానిక ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ కార్యక్రమ విజయోత్సవాలను నిర్వహించింది. నేత్రదాన ప్రాముఖ్యత పట్ల ప్రజల్లో అవగాహనను పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు ఏకే ఫరీదా, సిద్ధార్థ వైద్య కళాశాల అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. నేత్రదాన సందేశాన్ని ప్రచారం చేయటంలో సమగ్ర పాత్ర పోషించిన సామాజిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య ఆసుపత్రుల సిబ్బందిని సత్కరించారు.