సంకల్పసిద్ధి మోసం వెనుక ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని : అర్జునుడు

ABN , First Publish Date - 2022-11-27T01:19:27+05:30 IST

సంకల్పసిద్ధి మోసం వెనుక గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేనీ వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హస్తముందని టీడీపీ ఎమ్మెల్సీ, గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్‌ నాయకత్వంలో రూ.1,100 కోట్ల కుంభకోణానికి తెరలేచిందన్నారు.

సంకల్పసిద్ధి మోసం వెనుక ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని : అర్జునుడు
మాట్లాడుతున్న బచ్చుల అర్జునుడు

విద్యాధరపురం: సంకల్పసిద్ధి మోసం వెనుక గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేనీ వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హస్తముందని టీడీపీ ఎమ్మెల్సీ, గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్‌ నాయకత్వంలో రూ.1,100 కోట్ల కుంభకోణానికి తెరలేచిందన్నారు. వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడైన ఇడ్లీ రంగా, కొడాలి నాని, వంశీ ఈ మోసానికి రచన చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రూ.500 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ.600 కోట్ల దోపిడీ చేశార న్నారు. ఈ సొమ్ముతో వంశీ, నానీ హైదరాబాద్‌, బెంగళూరు లలో బినామీ పేర్లతో భూములను కొనుగోలు చేశారన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించి నిందితులు, వారికి సహకరించినవారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.1100 కోట్ల ప్రజల సొమ్ముకు ప్రభుత్వమే భాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వంలోని పెద్దలు నిందితులతో కుమ్మక్కై కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడితే రయ్‌న వచ్చే సీఐడీ పోలీసులకు రూ.1100 కోట్ల కుంభకోణం కనిపించక పోవడం శోచనీయమన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఐడీ పేరు ప్రతిష్టలు గాలిలో కలిసిపోయాయన్నారు.

Updated Date - 2022-11-27T01:19:28+05:30 IST