కట్టలేరు బ్రిడ్జి నిర్మాణంలో ఎమ్మెల్యే అబద్ధాలు

ABN , First Publish Date - 2022-08-10T06:22:21+05:30 IST

కట్టలేరు బ్రిడ్జి నిర్మాణం విషయంలో ప్రజలను ప్రభుత్వం పలు దఫాలుగా మోసం చేస్తూ ఉందని జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు అన్నారు.

కట్టలేరు బ్రిడ్జి నిర్మాణంలో ఎమ్మెల్యే అబద్ధాలు
కట్టలేరు వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

నిధులు మంజూరు కాకపోయినా అయినట్లు ప్రచారం : టీడీపీ

గంపలగూడెం : కట్టలేరు బ్రిడ్జి నిర్మాణం విషయంలో ప్రజలను ప్రభుత్వం పలు దఫాలుగా మోసం చేస్తూ ఉందని జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కట్టలేరు వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. రాజేశ్వరరావు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్యే రక్షణనిధి బ్రిడ్జి నిర్మాణానికి రూ.15కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇంతవరకు నిధులు మంజూరు కాలేదన్నారు. ఎమ్మెల్యే నిధులు మంజూరు అయ్యాయని, జూన్‌, జూలై నెలల్లో పనులు మొదలుపెడతామని చెప్పడంలో అర్థం లేదన్నారు. పనులు చేపట్టే ఫైల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయిలోనే ఉందని ఇంతవరకు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లలేదన్నారు. బ్రిడ్జి నిర్మాణం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో ఇసుక, మట్టి అక్రమ తోలకాలు చేపట్టి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారన్నారు. బ్రిడ్జి నిర్మాణంపై ఎమ్మెల్యే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బ్రిడ్జి నిర్మాణం టీడీపీ హయాంలోనే జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో దిరిశాల వెంకట కృష్ణారావు, జంగా చెంచురెడ్డి, ఇనుగంటి రాంబాబు, గువ్వల వెంకటేశ్వరరెడ్డి, మందడపు జానకి, వేముల బాలయ్య, ఇనుగంటి మధు, మానుగంటి రామకృష్ణ, కాజా రవికుమార్‌, ఎస్‌కె బాబు, దొంతాల బుచ్చిరామయ్య, రామకృష్ణ, ఉన్నం రమేష్‌, ప్రసాద్‌చౌదరి పాల్గొన్నారు.Updated Date - 2022-08-10T06:22:21+05:30 IST