Vijayawada: మంత్రి కారుమూరి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-17T20:45:53+05:30 IST

వైసీపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Vijayawada: మంత్రి కారుమూరి వివాదాస్పద వ్యాఖ్యలు

విజయవాడ (Vijayawada): వైసీపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు (Minister Karumuri) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు తోక ఒక్కటే తక్కువని అన్నారు. ఆయన అభిమానులే పవన్‌ను కారుపై నుంచి తోసేశారన్నారు. మంత్రి రోజా (Minister Roja)కు తల పగిలేదని, తృటిలో ప్రమాదం తప్పిందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, లా అండ్ ఆర్డర్ (Law and order) సమస్య లేకుండా చూడాలన్నారు.


ఉద్యమాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్‌దని, ఆయనతో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయాలని మంత్రి కరుమూరి అన్నారు. గవర్నర్‌ను కలిసి చెపితే లా అండ్ ఆర్డర్ చూడొద్దంటారా?.. ఆరు నెలల క్రితం షెడ్యూల్ ఇచ్చినా పరిస్ధితిని బట్టి కార్యక్రమం మార్చుకోవాలన్నారు. పవన్ పర్యటనలో శాంతి భద్రతలకు విఘాతం గలిగితే ఎవరిది బాధ్యత? అని ప్రశ్నించారు. మంత్రులపై దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎలాంటి శాంతి భద్రతల సమస్య రాకూడదనే  పోలీసులు జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారన్నారని మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-17T20:45:53+05:30 IST