పసుపు సైనికుల కదనోత్సాహం

ABN , First Publish Date - 2022-06-25T06:28:24+05:30 IST

పసుపు సైనికులు కదం తొక్కుతున్నారు. ఎన్నడూ లేనంతగా టీడీపీ శ్రేణులు గుడివాడలో నిర్వహించనున్న ఎన్టీఆర్‌ స్ఫూర్తి - చంద్రన్న భరోసా కృష్ణాజిల్లా మహానాడుకు శుక్రవారం ఏర్పాట్లు ప్రారంభించారు.

పసుపు సైనికుల కదనోత్సాహం
శోభనా కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తున్న రావి వెంకటేశ్వరరావు

గన్నవరం నుంచి అంగలూరు సభాస్థలి వరకు అంతా పసుపుమయం

ఎన్టీఆర్‌ స్ఫూర్తి- చంద్రన్న భరోసా కృష్ణాజిల్లా మహానాడుకు విస్తృత ఏర్పాట్లు

గుడివాడ/గుడ్లవల్లేరు, జూన్‌ 24 : పసుపు సైనికులు కదం తొక్కుతున్నారు. ఎన్నడూ లేనంతగా టీడీపీ శ్రేణులు గుడివాడలో నిర్వహించనున్న ఎన్టీఆర్‌ స్ఫూర్తి - చంద్రన్న భరోసా కృష్ణాజిల్లా మహానాడుకు శుక్రవారం ఏర్పాట్లు ప్రారంభించారు. గుడ్లవల్లేరు మం డలం అంగలూరులో బహిరంగ సభ నిర్వహించనున్న స్థలానికి భూమి పూజ చేశారు. గుడివాడ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ మం త్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కృష్ణాజిల్లా టీడీ పీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, పామర్రు ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా, పెడన ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి పాల్గొన్నారు. సభాస్థలానికి చదును పనులు ప్రారంభించారు. అనంతరం సభకు వ్యవసాయ క్షేత్రాలను ఇచ్చిన రైతులను సత్కరించారు. తొలుత గుడివాడ శోభనా కాన్ఫరెన్స్‌ హాలులో ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నేతలు సమావేశమై మహానాడు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ల నా రాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం కావాలని ప్రజలు బలీయంగా కోరుకుంటున్నారన్నారు. గన్నవరం నుంచి సభాస్థలి వరకు మొత్తం పసుపుమయం చేయాలని నిర్ణయించారు. సభకు ముందు పట్టణంలో రోడ్‌షో నిర్వహణకు రూట్‌మ్యా ప్‌పై చర్చించారు. 29, 30న టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు చేపట్టిన కృష్ణాజిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేశా రు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ గుడివాడ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక టీడీపీ కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గ సర్వసభ్య సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు గ్రామ, వార్డు, బూత్‌ కమిటీల సమావేశాలు ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుడివాడలో క్యాసినోలు, పేకాట శిబిరాలు, మట్టి అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమ తోలకాలు, భూ కబ్జాలు, కు ల చిచ్చులు ఆగాలంటే టీడీపీ గెలవాల్సిన ఆవశ్యతక ఉందన్నారు. కోవర్టులతో కొడాలి నాని సాగించిన ఆటలకు చరమగీతం ఖాయమని స్పష్టం చేశారు. సభకు నియోజకవర్గం నుంచే లక్ష మందిని సమీకరించాలని, కార్యకర్తలు, నేతలు ఆదిశగా పనిచేయాలన్నారు. 29న రోడ్‌షో విజయవంతానికి ప్రతి వార్డు నుంచి వెయ్యి మంది రావాలన్నారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు దింట్యా ల రాంబాబు, రూరల్‌ మండల అధ్యక్షుడు వాసే ము రళీ, నందివాడ మండల పార్టీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, తెలుగురైతు జిల్లా ఉపాధ్యక్షుడు ముళ్లపూడి రమే్‌షచౌదరి, ఎస్సీసెల్‌ నేతలు పిళ్లా సాల్మన్‌, కనకాంబరం, వాణిజ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోకవరపు సునీల్‌, బీపీ సెల్‌ నేతలు మెరుగుమాల బ్ర హ్మయ్య, దేవరపల్లి కోటి, సీనియర్‌ టీడీపీ నేతలు కం చర్ల సుధాకర్‌, కాకరాల సురేష్‌, యలమంచిలి సతీష్‌, ఉప్పాల వెంకటేశ్వరరావు, యార్లగడ్డ రవి, కొల్లి కృష్ణారావు (పెదబాబు), శొంఠి రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T06:28:24+05:30 IST