మట్టి వినాయకుడినే పూజించండి

ABN , First Publish Date - 2022-08-31T06:40:04+05:30 IST

మట్టి వినాయకుడినే పూజించండి

మట్టి వినాయకుడినే పూజించండి

 పెనమలూరు, ఆగస్టు 30 : పర్యావరణ పరి రక్షణకు వినాయక చవితి పర్వదినాన్ని మట్టి వినాయకు లతోనే జరుపుకోవాలని టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు పిలుపు నిచ్చారు. మంగళవారం టీడీపీ తరఫున ఆయన ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్‌ బుజ్జి, షేక్‌ ఇమాం, బలగం కొండ, యార్లగడ్డ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.

ఫ టీడీపీ ఆధ్వర్యంలో షుమారు మూడు వందల వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనుమో లు ప్రభాకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి బోడె ప్రసాద్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతే పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలనే ప్రజలు పూజించాలని కోరారు. కార్యక్ర  మంలో టీడీపీ నాయకులు,   పాల్గొన్నారు.

ఉయ్యూరు  : పర్యావరణ పరి రక్షణకు వినాయ కచవితి పండుగకు మట్టివిగ్రహాలు వినియోగించి పూజలు చేయాలని వాకర్స్‌ అసోసియేషన్‌ జిల్లా మాజీ గవర్నర్‌ నూకల సాంబశివరావు అన్నారు. వినాయకచవితి పురస్కరించుకుని సుధీర్‌ టింబర్‌ డిపో ఆధ్వర్యంలో మంగళవారం 1700 మట్టి విగ్రహాలు, పూజా సామాగ్రి, వినాయక వ్రతకల్పం పుస్తకాలు పంపిణీ చేశారు.  హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : రంగన్నగూడెం, మల్లవల్లి, తిప్పనగుంట, కొత్తపల్లి తదితర గ్రామాల్లో భారీగా పందిళ్లు వేసి వినాయకచవితి వేడుకలకు సిద్ధం చేస్తున్నారు.  వాసవీ యువ సేన తదితర సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి రమేష్‌ ఆధ్వర్యంలో వడ్డి నాగేశ్వరరావు, సుంకర అర్జున్‌, తోట వెంకటేష్‌ మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.  

Read more