స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2022-08-09T05:53:11+05:30 IST

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మచిలీపట్నం పోలీస్‌పేరేడ్‌ గ్రౌండులో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ రావిరాల అన్నారు.

స్వాతంత్య్ర  వేడుకలకు ఏర్పాట్లు చేయండి

  జేసీ మహేష్‌కుమార్‌ రావిరాల

 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మచిలీపట్నం పోలీస్‌పేరేడ్‌ గ్రౌండులో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ రావిరాల అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ సంక్షేమశాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ స్టాల్స్‌, శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం నిధులను కూడా విడుదల చేశామన్నారు. 

  స్పందన అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు 

స్పందన కార్యక్రమంలో ప్రజలనుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జేసీ అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అందుకు సంబంధించిన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉంచవద్దని, ఒకే సమస్యపై అర్జీలు పదేపదే రాకుండా ఉండేలా సమస్యలకు సరైన పరిష్కారం చూపాలన్నారు. 

Updated Date - 2022-08-09T05:53:11+05:30 IST