సమస్యలపై పోరాడే లోకేశ్‌కు మద్దతునిద్దాం

ABN , First Publish Date - 2022-12-31T00:52:42+05:30 IST

రాష్ట్ర యువతరానికి నారా లోకేశ్‌ పేటెంట్‌ లాంటివాడని, యువత సమస్యలపై లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర భగవంతుని ఆశీస్సులతో విజయవంతం కావాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కోరారు.

 సమస్యలపై పోరాడే లోకేశ్‌కు మద్దతునిద్దాం
గుడివాడ యువగళం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రావి

గుడివాడ, డిసెంబరు 30 : రాష్ట్ర యువతరానికి నారా లోకేశ్‌ పేటెంట్‌ లాంటివాడని, యువత సమస్యలపై లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర భగవంతుని ఆశీస్సులతో విజయవంతం కావాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కోరారు. శుక్రవారం స్ధానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో యువగళం పాదయాత్ర ప్రచార గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దింట్యాల రాంబాబు, వాసే మురళీ, దానేటి సన్యాసిరావు, గోవాడ శివ, మాజీ కౌన్సిలర్లు శొంఠి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, పొట్లూరి వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

కోడూరు : నారా లోకేశ్‌ యువగళం పేరుతో చేపట్టబోతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ కోడూరు మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు కోరారు. టీడీపీ కార్యాల యంలో పార్టీ నేతలు శుక్రవారం సమావేశం నిర్వహించారు.

అవనిగడ్డ టౌన్‌ : జనవరి 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న యువగళం పాదయాత్ర కార్యక్రమం విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.

చల్లపల్లి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జనవరి 27వతేదీ నుంచీ యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని చల్లపల్లి మండల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, జిల్లా తెలుగుమహిళా ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారిలు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

కూచిపూడి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా మొవ్వ మండల తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు. ఈ మేరకు మొవ్వలో పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించి సంఘీభావం తెలిపారు.

పమిడిముక్కల: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రను పురస్కరిం చుకొని శుక్రవారం వీరంకిలాకులో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు.

పామర్రు : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అండగా నిలిచి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో మహా పాదయాత్రకు నాంది పలికినట్లు టీడీపీ పామర్రు ఇన్‌చార్జి వర్ల కుమార్‌ రాజా అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో యువగళం బ్యానర్‌ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

పెదపారుపూడి : యువ నాయకుడు నారా లోకేష్‌ జరుప తలపెట్టిన యువగళంం లోగోను పార్టీ మండల అధ్యక్షుడు చలసాని రమేష్‌ చౌదరి ఆధ్వర్యంలో మండలంలోని దోసపాడులో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సజ్జా శివకుమార్‌ విడుదల చేశారు.

Updated Date - 2022-12-31T00:52:44+05:30 IST