Andhra Pradesh: బాదుడు ఇకనైనా ఆపాలి: సీఎం Jaganకు నారా Lokesh లేఖ
ABN , First Publish Date - 2022-05-22T23:17:40+05:30 IST
నిత్యావసరాల ధరలు పెంచి.. రకరకాల కొత్త పన్నులు విధించి.. పాతపన్నులను రెట్టింపు చేసి సామాన్యుల బతుకు దుర్భరంగా మార్చిన ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా బాదుడు ఆపాలని టీడీపీ

నిత్యావసరాల ధరలు పెంచి.. రకరకాల కొత్త పన్నులు విధించి.. పాతపన్నులను రెట్టింపు చేసి సామాన్యుల బతుకు దుర్భరంగా మార్చిన ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా బాదుడు ఆపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా వుండటంతో లారీ యజమానులు అక్కడే తమ లారీలకు ఫుల్ ట్యాంకు చేయించుకుని వస్తుండటాన్నిజగన్ గమనించే ఉంటారని గుర్తు చేశారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా జగన్ చూడాలన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి వెళ్తోన్న నేతల మొహం మీదే ప్రజలు ఛీ కొడుతుంటే.. జగన్ పాలన ఎలా ఉందో అర్థమవుతుందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.