యువతకు గుర్తింపు తెచ్చే సత్తా లోకేశ్‌కే

ABN , First Publish Date - 2022-12-31T00:21:24+05:30 IST

టీడీపీ జాతీయ కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేశ్‌కు యువతకు గుర్తింపు తెచ్చే సత్తా ఉందని టీడీపీ యువనాయకులు పేర్కొన్నారు.

యువతకు గుర్తింపు తెచ్చే సత్తా లోకేశ్‌కే
యువగళం పోస్టర్‌ను ఆవిష్కరించిన యువ నాయకులు

యువతకు గుర్తింపు తెచ్చే సత్తా లోకేశ్‌కే

వన్‌టౌన్‌, డిసెంబరు 30: టీడీపీ జాతీయ కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేశ్‌కు యువతకు గుర్తింపు తెచ్చే సత్తా ఉందని టీడీపీ యువనాయకులు పేర్కొన్నారు. పశ్చిమ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో నారా లోకేశ్‌ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, యువత లోకేశ్‌ నాయకత్వాన్ని కోరుతున్నారన్నారు. నాడు చంద్రబాబు తలపెట్టిన ఐటీ మహోద్యమం మళ్లీ అదే స్థాయిలో కొనసాగించాలంటే లోకేశ్‌ వంటి యువనాయకత్వం అవసరమన్నారు. ఆయన ఆధ్వర్యంలో పెద్ద యువసమూహం సిద్ధమవుతుందని, అన్ని రంగాల్లో అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. యువగళానికి యువత పూర్తి స్దాయిలో మద్దతు ఇవ్వాలన్నారు. ఎన్‌టీఆర్‌ జిల్లా అధికార ప్రతినిధి బెవర సాయి సుధాకర్‌ మాట్లాడుతూ, యువత సమస్యలపై స్పందించే సత్తా లోకేశ్‌కు మాత్రమే ఉందన్నారు. బబ్బూరి శ్రీవాసరావు, సారిపల్లి వెంకట రాధాకృష్ణ. బూర కనకారావు, కేఎస్‌ఆర్‌ శర్మ, అద్దేపల్లి శివ, గంటా రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:21:24+05:30 IST

Read more