డ్రగ్స్ తీసుకుంటే జీవితం పతనం
ABN , First Publish Date - 2022-06-26T06:05:00+05:30 IST
డ్రగ్స్‌కు అలవాటు పడితే వారి జీవితం పతనమేనని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ మోకా సత్తిబాబు అన్నారు.

అవగాహన సదస్సులో ఎస్ఈబీ జేడీ సత్తిబాబు
మైలవరం, జూన్ 25 : డ్రగ్స్‌కు అలవాటు పడితే వారి జీవితం పతనమేనని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ మోకా సత్తిబాబు అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్ఈబీ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.నారాయణస్వామి, ఎస్ఈబీ సీఐ పి.గిరిజ, జనరల్ ఫిజిషియన్ కె.కళ్యాణి తదిత రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తబాబు మాట్లాడుతూ ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్నట్టు కేసు నమోదు అయితే వారు జీవితంలో అన్నీ కోల్పోవటమే కాకుండా, తమతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుం దన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మన అందరి సమష్టి భాగస్వామ్యంతోనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. నారాయణస్వామి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డాక్టర్ కళ్యాణి మాట్లాడుతూ ఒంటరిగా కుంగిపోయి మత్తు పదా ర్థాలు ఎక్కువగా వాడటం వల్ల చివరికి ఆత్మహత్యలకు కూడా దారితీయవచ్చని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.అప్పారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బి.శివహరిప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ కె.హరినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.