టీడీపీని బలోపేతం చేద్దాం

ABN , First Publish Date - 2022-10-07T06:05:10+05:30 IST

టీడీపీని బలోపేతం చేద్దాం

టీడీపీని బలోపేతం చేద్దాం
టీడీపీ గ్రామ చైతన్య కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

విజయవాడ రూరల్‌, అక్టోబరు 6: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత అన్నిస్థాయిల్లోని నాయకులపై ఉందని ఆపార్టీ గన్నవరం నియోజకవర్గం ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సూచించారు. తెలుగు దేశం పార్టీ  గ్రామ చైతన్య కార్యక్రమాన్ని నున్నలో గురువారం పార్టీ నున్న అధ్యక్షుడు కలకోటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ హయాంలలో అభివృద్ధి పనులను బేరీజు వేసి, ప్రజలకు వివరించాలని అర్జునుడు సూచించారు. టీడీపీ సభ్యత్వ నమోదుతోపాటు బూత్‌స్థాయిలో ఓటర్ల జాబితాల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. టీడీపీ నేతలు గొడ్డళ్ల చిన రామారావు, దండు సుబ్రహ్మణ్యం రాజు, గుజ్జర్లపూడి బాబూరావు, గుంటక సుబ్బారెడ్డి, పామర్తి శ్రీనివాసరావు, మాదు శివరామప్రసాద్‌ పాల్గొన్నారు. 


Read more