Krishna river: కృష్ణా నదిలో ఏడుగురు గల్లంతు
ABN , First Publish Date - 2022-12-16T17:23:39+05:30 IST
యనమలకుదురు (Yanamalakuduru) దగ్గర విషాదం చోటుచేసుకుంది.
విజయవాడ: యనమలకుదురు (Yanamalakuduru) దగ్గర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నది (Krishna river)లో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు, ఇద్దరు సురక్షితంగా బయటకు వచ్చారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలానికి వెళ్లేందుకు సరైనమార్గం లేక సహాయ చర్యల్లో ఆటంకం ఏర్పడుతోంది. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నందున గాలింపు చర్యలు ఆలస్యమవుతోంది. గల్లంతైనవారు పటమటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థుల కోసం కృష్ణానదిలో మత్స్యకారులు గాలిస్తున్నారు.