టీడీపీ బృందంపై వైసీపీ రాళ్ల దాడి

ABN , First Publish Date - 2022-01-21T20:00:39+05:30 IST

కేసినో వ్యవహారంపై నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ బృందంపై వైసీపీ రాళ్ల దాడికి దిగింది.

టీడీపీ బృందంపై వైసీపీ రాళ్ల దాడి

కృష్ణా జిల్లా: గుడివాడ ఉద్రిక్తతగా మారింది. కేసినో వ్యవహారంపై నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ బృందంపై వైసీపీ రాళ్ల దాడికి దిగింది. మరోవైపు టీడీపీ నేతలను పోలీసులు అడుగుడుగున అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పార్టీ కార్యాలయం నుంచి కె కన్వెన్షన్‌కు టీడీపీ నేతలు బయలుదేరారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు పోటీగా ర్యాలీగా టీడీపీ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. అడ్డుకున్న పోలీసులను నెట్టేసి టీడీపీ శ్రేణులవైపు దూసుకొచ్చారు. పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. ఈ ఘటనలో బోండా ఉమ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.


మరోవైపు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అటు టీడీపీ, వైసీపీ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారు. వైసీపీ కార్యకర్తలు గుండాగిరి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని టీడీపీ నేతలు ఆరోపించారు. చివరికి పార్టీ కార్యాలయంలో కూడా ఉండకుండా చేశారని మండిపడ్డారు.

Updated Date - 2022-01-21T20:00:39+05:30 IST