అఘాయిత్యాలను ప్రతిఘటించాలి

ABN , First Publish Date - 2022-11-13T01:28:52+05:30 IST

వైసీపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, వీటిపై పోరాడేందుకు తెలుగు మహిళలు ముందుకురావాలని మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు.

అఘాయిత్యాలను ప్రతిఘటించాలి
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ

మచిలీపట్నంటౌన్‌, నవంబరు 12 : వైసీపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, వీటిపై పోరాడేందుకు తెలుగు మహిళలు ముందుకురావాలని మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా తెలుగు మహిళ సమావేశంలో కొనకళ్ల మాట్లాడారు. అక్రమాలను ఎదిరించే మహిళలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగు మహిళలు రాణి రుద్రమ, ఝాన్సీలక్ష్మీలు కావాలన్నారు. డిసెంబర్‌ తొలివారంలో మచిలీపట్నంలో కృష్ణాజిల్లా మహిళా భేరి సభను నిర్వహిస్తున్నామని, సభకు రాష్ట్రస్థాయి నేతలు వస్తున్నారన్నారు. సభాధ్యక్షురాలు, టీడీపీ జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత మాట్లాడుతూ, చంద్రబాబును సీఎంను చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మాట మంతి కార్యక్రమాన్ని హంసలదీవిలో అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జి మండలి బుద్ద ప్రసాద్‌ నేతృత్వంలో వినూత్న రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర, ప్రధాన కార్యదర్శి మూల్పూరు కళ్యాణి, జిల్లా అధికార ప్రతినిఽధులు మైనేని ఇందిర, పాలపర్తి పద్మజ, వడ్డి లక్ష్మి, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వాలిశెట్టి హైమవతి, జిల్లాప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి, బండే కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు బండ్రాజు సుధారాణి, మేడసాని రత్నకుమారి, లంకిశెట్టి నీరజ, బి.సుశీల, వసంతకుమారి, శ్రీదేవి, రమ్య, నాగమణి, పొట్లూరి జ్యోతి, యుగంధరి తదితరులు మాట్లాడారు.

Updated Date - 2022-11-13T01:29:46+05:30 IST