-
-
Home » Andhra Pradesh » Krishna » Keep the surroundings clean-NGTS-AndhraPradesh
-
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి
ABN , First Publish Date - 2022-09-28T06:17:20+05:30 IST
ప్రతీ ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు అన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి
హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు
సత్యనారాయణపురం, సెప్టెంబరు 27: ప్రతీ ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు అన్నారు. సత్యనారాయణపురం సర్కిల్టూ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ జడ్జి యు. రామ్మోహనరావు అధ్యక్షతన, ఏపీపీ సిధ్దీఖ్ సమక్షంలో హెల్త్ ఆఫీసర్ రామకోటేశ్వరరావు పర్యవేక్షణలో పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య సంరక్షణ విధానాలు, క్లీన్ అండ్ గ్రీన్, క్లీన్ ఏపీపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ టూ పరిధిలో ట్రేడ్లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి వారికి ఫైన్లు విధించారు. మొత్తం 41 మంది నుంచి రూ.24,540 వసూలు చేశారు. మున్సిపల్ కోర్టు సిబ్బంది, సర్కిల్ టూ పరిధిలోని శానిటరీ సుపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.