ఘనంగా కాగిత కృష్ణప్రసాద్‌ జన్మదిన వేడుక

ABN , First Publish Date - 2022-06-27T06:50:31+05:30 IST

పెడన అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోలాహలం, కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య కృష్ణప్రసాద్‌ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

ఘనంగా కాగిత కృష్ణప్రసాద్‌ జన్మదిన వేడుక

పెడన, జూన్‌ 26 : పెడన అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోలాహలం, కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య  కృష్ణప్రసాద్‌ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. స్వగ్రామం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట నుంచి ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం తోటమూలలోని పార్టీ కార్యాలయంలో ఆయన కేకు కట్‌ చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-06-27T06:50:31+05:30 IST