ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-03-05T06:14:57+05:30 IST

ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి

ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి
చిన్నాగిరిపల్లి లేఅవుట్‌లో మాట్లాడుతున్న హౌసింగ్‌ జేసీ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌

ఆగిరిపల్లి, మార్చి 4: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని హౌసింగ్‌ జేసీ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చిన్నాగిరిపల్లి, అమ్మవారిగూడెం, నెక్కలంగొల్లగూడెం, నూగొండపల్లి గ్రామాల్లోని లేఅవుట్లలో పక్కా ఇళ్ల నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఈ కాలనీలను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేస్తుందని, ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించి ప్రారంభానికి కాలనీలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 2019లో నిర్మించిన పక్కా ఇళ్లకు ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేయలేదని సీతారామపురం సర్పంచ్‌ అత్తి మురళీ జేసీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ వి.వి.భరత్‌ రెడ్డి, ఎంపీడీవో బి.సుహాసిని పాల్గొన్నారు.


Read more