వంతెనకు మరమ్మతులు చేపట్టాలి : జనసేన

ABN , First Publish Date - 2022-06-26T06:43:56+05:30 IST

మొవ్వ మండలం చినముత్తేవి గ్రా మంలో ఐనంపూడి డ్రెయిన్‌పై వంతెన కూలి పది రోజులవుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

వంతెనకు మరమ్మతులు చేపట్టాలి : జనసేన

కూచిపూడి  : మొవ్వ మండలం చినముత్తేవి గ్రా మంలో ఐనంపూడి డ్రెయిన్‌పై వంతెన కూలి పది రోజులవుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్‌ రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.  పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తాడిశెట్టి నరేష్‌, నేతలు గంగాధరరావు, కూనపరెడ్డి సుబ్బారావు, కాకి ఝాన్సీ, అనిత, తాడిశెట్టి సంధ్య, ఫణికుమార్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:43:56+05:30 IST