విశ్వేశ్వర ఘాట్, పద్మావతి ఘాట్‌లలో ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయొద్దంటూ జనసేన ధర్నా
ABN , First Publish Date - 2022-08-04T06:16:26+05:30 IST
కృష్ణలంక 21, 22 డివిజన్ల పరిధిలో వున్న విశ్వేశ్వర ఘాట్, పద్మావతి ఘాట్‌లలో ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయొద్దంటూ జనసేన పార్టీ నాయకుడు బుధవారం ధర్నా నిర్వహించారు.
విశ్వేశ్వర ఘాట్, పద్మావతి ఘాట్‌లలో
ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయొద్దంటూ జనసేన ధర్నా
కృష్ణలంక, ఆగస్టు 3 : కృష్ణలంక 21, 22 డివిజన్ల పరిధిలో వున్న విశ్వేశ్వర ఘాట్, పద్మావతి ఘాట్‌లలో ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయొద్దంటూ జనసేన పార్టీ నాయకుడు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ కమిషన్ల కోసం వైసీపీ కార్పొరేటర్లు కక్కుర్తి పనులకు పాల్పడుతున్నారన్నారు. ఆదాయమొస్తే చాలనే ధోరణిలో 21వ డివిజన్ ప్రజాప్రతినిధి ఉన్నారని మండిపడ్డారు. స్థానికుల వినతుల మేరకు జనసేన తరపున తాము ఈ పోరాటానికి శ్రీకారం చుట్టామని, ఫుడ్‌కోర్టుల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాడతామన్నారు. జనసేన నాయకులు పోతిరెడ్డి అనిత, పోతిరెడ్డి రమణ, కృష్ణ, లక్ష్మీశైలు, మట్టా వివేక్, ఎం.నీరజ, పి.శ్రీనాథ్, పి.సుజాత, వి.వెంకటేష్, హరిప్రసాద్, జయకుమార్, తోట శ్రీను, దుర్గారాణి పాల్గొన్నారు.