AP News: అది భూ రక్ష కాదు.. భూ భక్ష పథకం: జడ శ్రవణ్

ABN , First Publish Date - 2022-11-24T14:16:16+05:30 IST

జగనన్న నవరత్నాలు.. పేదలందరికీ ఇల్లు పేరుతో వైసీపీ నేతలు పేదల భూములు కాజేయలని చూసినా 10 వేల ఎకరాలను కాపాడామని జై భీం భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు.

AP News: అది భూ రక్ష కాదు.. భూ భక్ష పథకం: జడ శ్రవణ్

విజయవాడ: జగనన్న నవరత్నాలు (Jaganna Navratnalu).. పేదలందరికీ ఇల్లు పేరుతో వైసీపీ నేతలు (YCP Leaders) పేదల భూములు కాజేయలని చూసినా 10 వేల ఎకరాలను కాపాడామని జై భీం భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ (Jada Shravan Kumar) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘మీ భూమి మా హామీ’ పేరుతో జగనన్న భు హక్కు, భు రక్షను తెచ్చారని.. వైఎస్సార్ శాశ్వత భు హక్కు, భు రక్ష పథకం పేరు భు రక్ష కాదు.. భు భక్ష పథకం అని అన్నారు. కోనేరు రంగారావు (Koneru Ranga Rao) సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 10 లక్షల హేక్టర్‌ల భూమిని రాష్ట్రం మొత్తానికి సర్వే చేసి. వాటిని కైంకర్యం చేసుకొనే ప్రయత్నం ప్రారంభం అయిందన్నారు. సర్వేకు ఎవరైనా అంగీకరించినట్టయితే ఆ భూమి వారికి కాకుండా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పేదల దగ్గర భూములు లాక్కొని వైసీపీ చోటా మోటా నాయకులకు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ భూమిని సర్వే చేస్తామని అధికారులు వస్తే వద్దని చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో పేదలందరూ.. ప్రభుత్వం తమకు ఏదో ఒక కార్యక్రమం చేస్తోందని అనుకుంటున్నారన్నారు. గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్‌లు జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. వార్డు సెక్రటరీ చేసిన రిజిష్టర్ డాక్యుమెంట్ కోర్టు ముందు నిలబడదని, ఎవరూ వార్డు సెక్రటరీల వద్ద రిజిస్ట్రేషన్‌లు చేయించుకోవద్దని జడ శ్రవణ్ కుమార్ సూచించారు.

Updated Date - 2022-11-24T14:16:26+05:30 IST