AP News: విశాఖ ఘటనపై న్యాయపోరాటానికి సిద్ధమైన పవన్‌ కల్యాణ్‌ ?

ABN , First Publish Date - 2022-10-17T22:13:23+05:30 IST

విజయవాడ: విశాఖపట్నంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మొత్తం 115 మందిపై అక్రమ అరెస్టుల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్యాయ పోరాటానికి దిగుతున్నట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించి, అరెస్టులు చేశారని పవన్ మండిపడ్డారు. ప్రజలకు అభివాదం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీస్

AP News: విశాఖ ఘటనపై న్యాయపోరాటానికి సిద్ధమైన పవన్‌ కల్యాణ్‌ ?

విజయవాడ: విశాఖపట్నంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మొత్తం 115 మందిపై అక్రమ అరెస్టుల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్యాయ పోరాటానికి దిగుతున్నట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించి, అరెస్టులు చేశారని పవన్ మండిపడ్డారు. ప్రజలకు అభివాదం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీస్ ఆంక్షలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోరాటం ప్రభుత్వంతో తప్ప పోలీసులతో కాదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. జగన్ సర్కార్‌ను నియంత్రించేందుకు న్యాయ పోరాటం చేస్తామని పవన్ తెలిపారు.

Updated Date - 2022-10-17T22:13:23+05:30 IST