రోడ్ల పరిశీలన

ABN , First Publish Date - 2022-12-31T00:24:26+05:30 IST

23వ డివిజన్‌ పరిధిలోని గవర్నర్‌పేట, సూర్యారావుపేట ప్రాంతాల్లో రూ. 96 లక్షల ఖర్చుతో ఇటీవల నిర్మించిన సిమెంట్‌ రోడ్లను టీడీపీ ఫ్లోర్‌లీడర్‌, డివిజన్‌ కార్పొరేటర్‌ నెలిబండ్ల బాలస్వామి శుక్రవారం పరిశీలించారు.

 రోడ్ల పరిశీలన

రోడ్ల పరిశీలన

గవర్నర్‌పేట, డిసెంబరు 30: 23వ డివిజన్‌ పరిధిలోని గవర్నర్‌పేట, సూర్యారావుపేట ప్రాంతాల్లో రూ. 96 లక్షల ఖర్చుతో ఇటీవల నిర్మించిన సిమెంట్‌ రోడ్లను టీడీపీ ఫ్లోర్‌లీడర్‌, డివిజన్‌ కార్పొరేటర్‌ నెలిబండ్ల బాలస్వామి శుక్రవారం పరిశీలించారు. డివిజన్‌ పరిధిలోని గోవిందరాజులు నాయుడు వీధి, విష్ణువర్థన్‌రావు వీధి, కాంగ్రెస్‌ కార్యాలయం వీధి, గోపు రామచంద్రరావు వీధి రోడ్ల నిర్మాణానికి వీఎంసీ ఎన్నికలకు ముందు రూ. 76.10 లక్షలతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు నిలిచిపోయాయని, తాను రెండో సారి ఎన్నిక కాగానే అవే ప్రతిపాదనలు కౌన్సిల్‌లో పలుమార్లు పెట్టడం, పనులకు మోక్షం రావడం జరిగిందన్నారు. గోపు రామచంద్రరావు వీధి మినహా మిగిలిన రోడ్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. భవానీ వీధితో పాటు మరో రెండు రోడ్లు వేయాల్సి ఉందని, వీటిని త్వరలో పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-12-31T00:24:26+05:30 IST

Read more