ఎయిమ్స్‌కు నీటి సరఫరా చేయని అసమర్థ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-10-07T05:56:41+05:30 IST

ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌కు కనీస నీటి సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వమిదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

ఎయిమ్స్‌కు నీటి సరఫరా చేయని అసమర్థ ప్రభుత్వం
ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న దేవినేని ఉమా

ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా 

రెడ్డిగూడెం, అక్టోబరు 6: ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌కు కనీస నీటి సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వమిదని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అన్నేరావుపేటలో బుధవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  మూడున్నరేళ్లలో ఎయిమ్స్‌ కోసం ఏం చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వ చేతకాని తనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదన్నారు. నేతలు, కార్యకర్తలనుసమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


Read more