టీడీపీ గన్నవరం అభ్యర్థిని నేనే!
ABN , First Publish Date - 2022-10-17T06:51:40+05:30 IST
టీడీపీ గన్నవరం అభ్యర్థిని నేనే!
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రకటన
గుణదల, అక్టోబరు 16: టీడీపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో గన్నవరంలో తానే పోటీ చేస్తానని బచ్చుల అర్జునుడు ప్రకటించారు. విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడు గ్రామంలో టీడీపీ గ్రామ చైతన్య కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన నబీగారి కొండయ్య(కొండ)ను పార్టీ గ్రామ అఽధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, ఓటర్లిస్ట్ పరిశీలన, సభ్యత్వ నమోదుపై నాయకులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. క్రమశిక్షణ తప్పి, ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. క్లస్టర్ ఇన్చార్జ్ బొప్పన హరికృష్ణ, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు అద్దేపల్లి సాంబశివరావు నాగరాజు (సాంబు), జిల్లా ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యం రాజు, మహిళా కార్యదర్శి బొమ్మసాని అరుణకుమారి, పట్టపు జ్యోతి పాల్గొన్నారు.