Investments: ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులు.. వీడియో చూస్తే షాక్..
ABN , First Publish Date - 2022-12-07T15:57:37+05:30 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. వరుసకట్టి లారీలపై పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు (Investments) తరలివస్తున్నాయి. వరుసకట్టి లారీలపై పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయి. ఇక నిరుద్యోగమనేది రాష్ట్ర సరిహద్దులో అడుగైనా పెట్టడం ఇక అసాధ్యం. సీఎం జగన్ (CM Jagan), ఆయన అండగా ఉండే మీడియా త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్న వార్తలతో ఏపీ (AP) హోరెత్తిపోతుంటే.. ఇంత పెద్ద వార్త ఎలా చూడలేదని ఆశ్చర్యపోవద్దు. నీలం రంగులు వేసుకుని లారీలపై వస్తున్న పానీపూరి చాట్ మసాల బడ్డీలను త్వరలోనే జగన్ రెడ్డి సర్కార్ యువతకు అందజేయనుంది. ఇదే ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న భారీ పెట్టుబడులు.
ఇప్పటి వరకు చేపల మార్కెట్లు, మటన్ షాపుల్లో యువతకు ఉపాధి కల్పించిన జగన్ ప్రభుత్వం ఇకపై పానీపూరి చాట్ మసాల బడ్డీలను అందజేయనుంది. అధికార పీటంపై తాము ఉన్నంత కాలం.. పెద్ద పరిశ్రమలేవీ పెట్టుబడులు పెట్టవని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రావని తేలిపోవడంతో జగన్ సర్కార్ ఈ బడ్డీలు ఇవ్వబోతోంది.