చిన్నసైజు రేకుల షెడ్డు ఇంటి పన్ను రూ.77,900
ABN , First Publish Date - 2022-05-21T06:40:58+05:30 IST
చిన్నసైజు రేకుల షెడ్డు ఇంటి పన్ను రూ.77,900
కొండపల్లి మున్సిపల్ అధికారుల నిర్వాకం
చెల్లించకపోతే ఇల్లు జప్తు చేస్తామని బెదిరింపు
ఫొటోలో ఉన్న చిన్న రేకుల షెడ్డును చూశారా? సరిగ్గా ఒక కుటుంబానికి కూడా సరిపోని ఈ చిన్న ఇంటికి కొండపల్లి మున్సిపల్ అధికారులు ఏకంగా రూ.77,900 ఇంటిపన్ను వేశారు. ‘ఇదేమిటి..? గతంలో తాము రూ.264 చెల్లించాం.’ అని ఆ ఇంటి యజమాని చెప్పినా అధికారులు ససేమిరా.. అంటున్నారు. కొండపల్లి గీతామందిర్ రోడ్డులోని రాపాని అంకరాజుకు చెందిన ఈ ఇంటికి ఇంత బిల్లు ఇవ్వడమే ఓ తప్పయితే, ఆ బిల్లు చెల్లించకపోతే జప్తు చేస్తామని బెదిరించడం మరో తప్పు. ఇదేమిటని రసీదు ఇచ్చిన వలంటీరును ప్రశ్నించగా, ‘అదేమి మాకు తెలియదు అధికారులు ఇవ్వమన్నారు.. ఇచ్చాం. పన్ను కట్టాల్సిందే..’ అని ఘంటా పథంగా చెప్పేశారు. లేకపోతే ఇంటిని జప్తు చేస్తామని హెచ్చరించారు. దీంతో బాధిత కుటుంబం లబోదిబోమంటూ స్థానిక నాయకుల వద్దకు పరుగులు తీసింది. - కొండపల్లి (ఇబ్రహీంపట్నం)