హైందవ ధర్మం దేశానికి జీవనాడి

ABN , First Publish Date - 2022-10-03T06:24:18+05:30 IST

హైందవ ధర్మం దేశానికి జీవనాడి

హైందవ ధర్మం దేశానికి జీవనాడి
మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్న త్రిదండి చినజీయర్‌స్వామి

గుడివాడ, అక్టోబరు 2: దేశానికి హైందవ ధర్మం జీవనాడి అని, దానిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని త్రిదండి చినజీయర్‌స్వామి సూచించారు. శ్రీభూ నీలా సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వైభవోపేతంగా నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో యార్లగడ్డ రాజేష్‌ దంపతుల సహకారంతో మహా కుంభాభిషేక సంప్రోక్షణ వేడుకలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణల నడుమ శిఖరానికి జీయర్‌స్వామి శాస్ర్తోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. మహా కుంభాభిషే కంలో పాల్గొనడం తన అదృష్టమని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జయరాజు, డీఈవో సాయిబాబు, ఆలయ  కార్యనిర్వహణాధికారి నటరాజన్‌ షణ్ముగం, జీయర్‌స్వామి శిష్య బృందం పాల్గొన్నారు. 


Read more