చుక్క గురక చేపల పెంపకంతో అధిక లాభాలు

ABN , First Publish Date - 2022-01-08T06:14:03+05:30 IST

చుక్క గురక చేపలను తక్కువ ఖర్చుతో పెంచి అధిక లాభాలు పొందవచ్చునని విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్త డాక్టర్‌ శుభదీప్‌ఘోష్‌ అన్నారు.

చుక్క గురక చేపల పెంపకంతో అధిక లాభాలు
పెదపాలెంలో చుక్క గురక చేపలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ శుభదీప్‌ఘోష్‌

నాగాయలంక : చుక్క గురక చేపలను తక్కువ ఖర్చుతో పెంచి అధిక లాభాలు పొందవచ్చునని విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్త డాక్టర్‌ శుభదీప్‌ఘోష్‌ అన్నారు. పెదపాలెం గ్రామంలో శుక్రవారం రాయితీతో షెడ్యూల్‌ తెగల వారికి గ్రూపుగా కేటాయించిన తక్కువ వాడుక భూముల్లోని చెరువుల్లో పెంచిన చుక్క గురక చేపల పట్టుబడిని ఆయన పరిశీలించారు. 10 నెలలపాటు పెంచిన ఎకరం చెరువులోని చుక్క గురకలు ఒక్కొక్క చేప 120 గ్రాములకు చేరుకున్నట్లు  గుర్తించారు. కేజీ మార్కెట్‌లో రూ.225లు ఉండగా, ఎకరాకు రూ. 1.14 లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఆసక్తి గల ఆక్వా రైతులు విశాఖపట్నంలోని సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.  కార్యక్రమంలో శేఖర్‌ మేగరాజన్‌, చెన్ను వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-08T06:14:03+05:30 IST