భారీ వర్షం.. ముంపులో లోతట్టు ప్రాంతాలు

ABN , First Publish Date - 2022-10-07T05:58:03+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో పట్టణంలో గురువారం కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు వరదనీటితో నిండిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

భారీ వర్షం.. ముంపులో లోతట్టు ప్రాంతాలు
తిరువూరులో వాహనచోదకుల ఇక్కట్లు

తిరువూరు, అక్టోబరు 6: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో పట్టణంలో గురువారం కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు వరదనీటితో నిండిపోగా, లోతట్టు  ప్రాంతాలు జలమయం అయ్యాయి. బైపాస్‌ జంక్షన్‌ సమీపంలో వాహనచోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. భారీ వర్షం పడిన ప్రతిసారి ఈ ప్రాంతంలో రోడ్డుపై సుమారు నాలుగు అడుగుల మేర వరదనీరు నిలిచి రాకపోకలకు  ఇబ్బందిగా మారుతుందని స్థానికులు అంటున్నారు.  తిరువూరు రెవెన్యూ డివిజన్‌లోని తిరువూరులో 19.8 మిల్లీమీటమీ, గంపలగూడెంలో  29.8 మి.మి., ఎ.కొండూరు  35.6 మి.మి., విస్సన్నపేట 30.6 మి.మి., రెడ్డిగూడెంలో 25.8 మి.మి. వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.


బైక్‌ను ఢీకొన్న కారు 

 ఒకరి మృతి 

 మరో ఇద్దరికి గాయాలు

జగ్గయ్యపేట, అక్టోబరు 6: జాతీయరహదారిపై గౌరవరం వద్ద గురువారం్న బైక్‌పై రోడ్డు క్రాస్‌ చేస్తున్న వ్యక్తులను హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీకొనటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.  జెర్రిపోతుల ఆశీర్వాధం(35), ధారమళ్ల మధన్‌(25), బెంజిమన్‌ (30) బైక్‌పై ఇంటికి వెళ్లేందుకు లింగగూడెం క్రాస్‌ రోడ్డు నుంచి వస్తుండగా కారు ఢీకొంది. ఆశీర్వాదం అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన బాధితులను నందిగామ ఆసుపత్రిలో ప్రథమచికిత్స అనంతరం విజయవాడకు తర లించారు. చిల్లకల్లు ఎస్సై చినబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read more