హరే కృష్ణా!
ABN , First Publish Date - 2022-08-19T06:51:07+05:30 IST
హరే కృష్ణా!

ఇస్కాన్ మందిరంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
రామలింగేశ్వరనగర్, ఆగస్టు 18: హరే రామ..హరే రామ.. రామ రామ హరే హరే.. హరే కృష్ణ.. హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే! అంటూ ఇస్కాన్ మందిరం మార్మోగింది. మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. గురువారం జగన్నాథ స్వామి భజన కార్యక్రమాలు, ఉట్టి ఉత్సవం నిర్వహించారు. జగన్నాథ, బలదేవ, సుభధ్రలకు మహాభిషేకం, అనంతరం చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణ, స్వామి జీవిత చరిత్ర తెలుపుతూ తోలుబొమ్మలాట, కీర్తన, కూచిపూడి నృత్యం, రంగోళి, చిన్నారులకు తులాభారం, లేజర్ షో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి పలు పూజా కార్యక్రమాలు, విశేషంగా వచ్చిన భక్తులకు ప్రసాద పంపిణీ నిర్వహించారు. సాయంత్రం భారీగా భక్తులు రావడంతో ప్రాంగణం కిటకిటలాడింది.
