-
-
Home » Andhra Pradesh » Krishna » gramabhivrudhiloo sarpanchladee kilaka patra-NGTS-AndhraPradesh
-
గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక పాత్ర
ABN , First Publish Date - 2022-02-23T06:03:36+05:30 IST
గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక పాత్ర

ఉయ్యూరు, ఫిబ్రవరి 22 : గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లది ముఖ్య భూమిక అని ఉయ్యూరు ఎంపీడీవో సునీతాశర్మ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాల్లో ఎరువుగా తయారు చేయించి పంచా యతీకి ఆదాయ వనరుగా మార్చుకోవాలని సూచించారు. మానసిక రుగ్మతలు కలిగిన పిల్లలకు ఐసీడీఎస్ శాఖ ద్వారా అవసరమైన సహాయం అందేలా చూడాల న్నారు. హౌసింగ్ ఏఈ బుల్లియ్య, పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూ ఎస్ ఏఈ సుబ్బారావు పాల్గొని సర్పంచ్‌ల సందేహలు నివృత్తి చేశారు.