రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-11-23T00:38:46+05:30 IST

కనుమూరు, గుల్లపుడి, నెమలి, సత్యాలపాడు, అమ్మిరెడ్డిగూడెం, చిన్నకొమెర గ్రామాల్లోని పీఏసీఎస్‌ల్లో, ఆర్బీకేల్లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు మంగళవారం పరిశీలించారు.

రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై అధికారుల సమీక్ష

గంపలగూడెం, నవంబరు 22: కనుమూరు, గుల్లపుడి, నెమలి, సత్యాలపాడు, అమ్మిరెడ్డిగూడెం, చిన్నకొమెర గ్రామాల్లోని పీఏసీఎస్‌ల్లో, ఆర్బీకేల్లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈనెల 24 నుంచి ప్రారంభించాలని సిబ్బందిని ఆదేశించారు. కనుమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు - నేడు కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కొత్త మెనూ ప్రకారం తయారు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని అధికారులు పరిశీలిం చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.బాలకృష్ణారెడ్డి, ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, ఏవో బి.సాయిశ్రీ, పీఏసీఎస్‌ చైర్మన్లు పోట్రు శశాంక్‌, చెరుకు భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:38:46+05:30 IST

Read more