ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-10-07T05:53:05+05:30 IST
పెదకొమెర శివారు తోటమూల సెంటర్లో సర్వే నంబరు 64/2లో ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే కె.రక్షణనిధి
కలెక్టర్ దిల్లీరావుతో ఎమ్మెల్యే రక్షణనిధి
తిరువూరు/గంపలగూడెం, అక్టోబరు 6: పెదకొమెర శివారు తోటమూల సెంటర్లో సర్వే నంబరు 64/2లో ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే కె.రక్షణనిధి గురువారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దిల్లీరావ్‌ను కోరారు. ప్రభు త్వ భూమిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. కనుమూరులో రైతుల భూములు అటవీ పోరంబోకు భూములుగా రికార్డుల్లో నమోదు కావ డంతో వాటిని ప్రభుత్వ రికార్డుల్లో తొలగించి ఎస్సీ, బీసీలకు చెందిన రైతులకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్‌కు తెలిపారు. విస్సన్నపేట మండలం పుట్రేలలోని ఉషోదయ భూములకు పాస్ పుస్తకా లను లబ్ధిదారులకు అందించాలని, తెల్లదేవరపల్లి రైతుల సమస్యలను కలెక్టరుకు వివరించారు.