వల్లూరుపాలెంలో గౌతు లచ్ఛన్న విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-06-27T06:44:29+05:30 IST

గౌడ సంఘీయులందరూ జాతి ఐక్యత కోసం కృషి చేయాలని సోంపేట మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజి అన్నారు. వల్లూరుపాలెంలో గౌడ సంఘం నిర్మించిన స్వాంత్య్ర సమరయోధుడు సర్ధార్‌ గౌతు లచ్ఛన్న విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం శ్యామ్‌ సుందర్‌ శివాజి, భార్య విజయలక్ష్మీ, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఆవిష్కరించారు.

వల్లూరుపాలెంలో గౌతు లచ్ఛన్న విగ్రహావిష్కరణ

తోట్లవల్లూరు : గౌడ సంఘీయులందరూ జాతి ఐక్యత కోసం కృషి చేయాలని సోంపేట మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజి అన్నారు.  వల్లూరుపాలెంలో గౌడ సంఘం నిర్మించిన స్వాంత్య్ర సమరయోధుడు సర్ధార్‌ గౌతు లచ్ఛన్న విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం శ్యామ్‌ సుందర్‌ శివాజి, భార్య విజయలక్ష్మీ, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఆవిష్కరించారు.  జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో శివాజీ మాట్లాడుతూ గౌతు లచ్ఛన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని అన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ తాను గౌతు లచ్ఛన్న బహుజనుల ఐక్యత కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఏ పార్టీలో గౌడ వ్యక్తికి సీటిస్తే అక్కడ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.  రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ కొనకాల రాజ్యలక్ష్మీ, గౌడ సంఘం నాయకులు ఉప్పాల రాంప్రసాద్‌, అనగాని రవి, కాగిత కొండ, కొనకళ్ళ రెడ్డమ్మ, బడుగు శ్రీను, ఈడే వాసు, కొనకాల వాసు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-06-27T06:44:29+05:30 IST