కానూరులో ఇంటింటికీ టీడీపీ.. గోపు పర్యటన
ABN , First Publish Date - 2022-08-04T06:37:46+05:30 IST
వైసీపీ ప్రభు త్వ అక్రమాలను ప్రజల వివరించేందుకే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టినట్లు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ తెలు గు రైతు అధ్యక్షుడు, మా ర్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ అన్నారు.
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 3 : వైసీపీ ప్రభు త్వ అక్రమాలను ప్రజల వివరించేందుకే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టినట్లు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ తెలు గు రైతు అధ్యక్షుడు, మా ర్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కానూరు గ్రామంలో బుధవారం గోపు సత్యనారాయణ పర్యటించారు. కొందరు వృద్ధులు తమకు ఫించన్లు అందడం లేదని గోపు సత్యనారాయణ వద్ద వాపోయారు. ఓటర్ల జాబితాను ఆయన పరిశీలించారు. బొమ్మిడి ఏడుకొండలు, సీతారామయ్య, ఈమని రామాంజనేయులు, మోపిదేవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.