మహిళ మెడలో నానుతాడు చోరీ

ABN , First Publish Date - 2022-03-05T06:10:32+05:30 IST

మహిళ మెడలో నానుతాడు చోరీ

మహిళ మెడలో నానుతాడు చోరీ

నూజివీడు టౌన్‌, మార్చి 4: బడ్డీ కొట్టు వద్ద ఆగి కూల్‌డ్రింక్స్‌ అడిగిన యువకులు కొట్టు యజమాని మెడలో నానుతాడు తెంపుకెళ్లిన ఘటన శుక్రవారం మొర్సపూడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చోడగిరి బేబీ సరోజిని బడ్డీకొట్టు నడుపుతోంది. ఇద్దరు యువ కులు బైక్‌పై వచ్చి కూలిడింక్స్‌ కావాలని ఆమెను అడిగారు. డ్రింక్స్‌ తీస్తుండగా మెడలోని బంగారు నానుతాడును తెంపుకొని పరారయ్యారు. దీనిపై బేబీసరోజినీ నూజివీడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు


Updated Date - 2022-03-05T06:10:32+05:30 IST