తిరుపతమ్మకు వెండి కిరీటం కానుక
ABN , First Publish Date - 2022-10-17T05:50:19+05:30 IST
తిరుపతమ్మ దేవస్థానానికి గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన లక్ష్మీనారాయణ కుమారుడు ఆదిశేషు 530గ్రాముల వెండితో తయారు చేసిన కిరీటాన్ని ఆదివారం చైర్మన్ ఇంజం చెన్నకేశవరావుకు
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ దేవస్థానానికి గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన లక్ష్మీనారాయణ కుమారుడు ఆదిశేషు 530గ్రాముల వెండితో తయారు చేసిన కిరీటాన్ని ఆదివారం చైర్మన్ ఇంజం చెన్నకేశవరావుకు అందించారు. దాతలకు వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం చేసి అమ్మవారి, స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో ఏఈవో తిరుమలేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు సునీత, జంగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.