బాపూజీ.. నీవైనా చెప్పు తండ్రీ

ABN , First Publish Date - 2022-10-03T05:56:39+05:30 IST

గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మచిలీపట్నం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలోని గాంధీ విగ్రహం వద్ద పలువురు సర్పంచ్‌లు గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం నిరసన తెలిపారు.

బాపూజీ.. నీవైనా చెప్పు తండ్రీ
గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న సర్పంచ్‌లు

ఆర్థిక సంఘం నిధుల కోసం

గాంధీ విగ్రహానికి సర్పంచ్‌ల వినతి

మచిలీపట్నం టౌన్‌ : గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మచిలీపట్నం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలోని గాంధీ విగ్రహం వద్ద పలువురు సర్పంచ్‌లు గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం నిరసన తెలిపారు. ఓ మహాత్మా.. నువ్వైనా సీఎం మనసు కరిగించి నిధులు విడుదల చేసేటట్టు కనువిప్పు కలిగించు తండ్రీ... అంటూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. చిన్నాపురం గ్రామ సర్పంచ్‌ కాగిత గోపాలరావు, శ్రీకాకుళం గ్రామ సర్పంచ్‌ ముప్పినేని రవిప్రసాద్‌, గోపువానిపాలెం గ్రామ సర్పంచ్‌ యార్లగడ్డ భూషయ్య, భావదేవరపల్లి సర్పంచ్‌ మండలి ఉదయ భాస్కర్‌, చోరగుడి సర్పంచ్‌ కందిమెళ్ల పూర్ణకుమారి, అలీనఖపాలెం సర్పంచ్‌ జైనబ్‌ సుల్తానా బేగం, బొర్రపోతుపాలెం సర్పంచ్‌ గట్టె సుశీల, టీడీపీ నాయకులు బత్తిన దాసు, ఆదినారాయణ మాట్లాడారు.

 గుడివాడ : గుడివాడలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. సర్పంచ్‌లు కాకరాల సుభా్‌షచంద్రబో్‌స (సురేష్‌), రాదాకృష్ణ, మన్యం పద్మావతి పాల్గొన్నారు. 

నాగాయలంక:  పంచాయతీ ఖాతాలో నిధులు వేయాలని కోరుతూ నాగాయలంకలో సర్పంచ్‌లు గాంధీజీ విగ్రహానికి వినతిపత్రమిచ్చి నిరసన తెలిపారు. 

 పామర్రు : పామర్రులో టీడీపీ నేతలు గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మండపాక శంకర్‌బాబు, ఈడే ఘంటయ్య, సందీప్‌, శ్రీను, సుబ్రహ్మణ్యం  పాల్గొన్నారు. 

Read more