అధిక మార్కులతో నకిలీ సర్టిఫికెట్లు

ABN , First Publish Date - 2022-12-13T00:54:08+05:30 IST

ఎస్‌ఎ్‌ససీలో ఎక్కువ మా ర్కులు వచ్చేలా చేస్తామని చెప్పి నకిలీ సర్టిఫికెట్లను ఇచ్చిన వ్యవహారం నగరంలో దుమారం రేపుతోంది. దీనికి సంబంధించి కర్నూలుకు చెందిన కొందరు బాధితులు సూర్యరావుపేట పోలీసులను ఆశ్రయించారు.

అధిక మార్కులతో నకిలీ సర్టిఫికెట్లు

విజయవాడ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఎ్‌ససీలో ఎక్కువ మా ర్కులు వచ్చేలా చేస్తామని చెప్పి నకిలీ సర్టిఫికెట్లను ఇచ్చిన వ్యవహారం నగరంలో దుమారం రేపుతోంది. దీనికి సంబంధించి కర్నూలుకు చెందిన కొందరు బాధితులు సూర్యరావుపేట పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండ లం పెద్దకోట కొండ గ్రామానికి చెందిన కొక్కు హరిప్రసాద్‌ బీజడ్‌సీ డిగ్రీని మధ్య లో వదిలేశాడు. తర్వాత కరెంటు బిల్లు రీడర్‌గా పనిచేశాడు. ఇందులో బాషా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు పరిచయం ఉన్న నాగార్జున అనే వ్యక్తి కన్సెల్టెన్సీ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పాడు. అతడు కర్నూలులో రూ.30వేలు తీసుకుని మూడు గ్రామాలకు చెందిన మీటర్‌ రీడింగ్‌ పని ఇప్పించాడు. తర్వాత పోస్టల్‌ శా ఖలో టెన్త్‌ అర్హతతో ఉద్యోగాల పడుతున్నాయని చెప్పారు. అప్పటికే తాను టెన్త్‌ పాసయ్యానని చెప్పగా అయినా మళ్లీ ఓపెన్‌ స్కూల్‌లో సింగిల్‌ సిట్టింగ్‌లో పరీక్ష లు రాస్తే 9.96, 9.87 మార్కులు వచ్చేలా చేస్తానని చెప్పాడు. అన్నామలై వర్సిటీ లో తెలినవారున్నారని, వారి ద్వారా సర్టిఫికెట్‌ ఇప్పిస్తానన్నాడు. ఇందుకు రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న 20 రోజులకు సర్టిఫిక్‌టెను నాగార్జున వాట్సా్‌పలో హరిప్రసాద్‌కు పంపాడు. ఈ సర్టిఫికెట్‌తో అతడు పోస్టల్‌ శాఖలో ఉ ద్యోగానికి దరఖాస్తు చేశాడు. ఉద్యోగానికి ఎంపికైనట్టు హరిప్రసాద్‌కు లేఖ వ చ్చింది. దాన్ని తీసుకుని నాగార్జున వద్దకు వెళ్లి చూపించాడు. పోస్టల్‌ శాఖకు డ బ్బులు కట్టాలని చెప్పి మరో రూ.50వేలు తీసుకున్నాడు. సర్టిఫికెట్ల పరిశీలనలో సర్టిఫికెట్‌ నకిలీదని అధికారులు గుర్తించారు. దీనిపై సంజాయిషీ కోరుతూ మో మో ఇచ్చారు. హరిప్రసాద్‌ వెంటనే నాగార్జునకు చెప్పాడు. నగరంలోని అన్నామలై వర్సిటీ బ్రాంచ్‌ ఆఫీసుకి వెళ్దామన్నాడు. హరిప్రసాద్‌తోపాటు మరికొంతమంది ఎంజీ రోడ్డులోని అన్నామలై బ్రాంచ్‌ ఆఫీసుకి వచ్చి చంద్రశేఖర్‌ అనే వ్యక్తిని అడిగారు. చంద్రశేఖర్‌ మాత్రం ఈ సర్టిఫికెట్లు ఫేక్‌ కాదన్నాడు. దీంతో బాధితులు సూర్యరావుపేట పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-12-13T00:54:08+05:30 IST

Read more