ప్రయాణాలు ఫుల్
ABN , First Publish Date - 2022-01-13T06:03:31+05:30 IST
ప్రయాణాలు ఫుల్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆర్టీసీలో పండుగ రద్దీ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తంగా 150 వరకు స్పెషల్ బస్సులను నడిపింది. హైదరాబాద్ నుంచి బుధవారం 79 స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులు తరలివచ్చారు. అలాగే, 346 రెగ్యులర్ బస్సులు నూరుశాతం ఆక్యుపెన్సీతో వచ్చాయి. ఇక విశాఖకు మొత్తం 43 స్పెషల్ బస్సులను నడిపారు. రాజమండ్రి వైపు 27, రాయలసీమ వైపు 15 బస్సులు నడిచాయి. ఇక గురువారం విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 135 స్పెషల్స్ నడపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మరో 200 బస్సులను రిజర్వులో ఉంచారు. రైల్వే విషయానికి వస్తే.. రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నాలుగు వీక్లీ స్పెషల్ రైళ్లను అధికారులు ప్రవేశపెట్టారు. ఈ రైళ్లు ఫిబ్రవరి 23వ తేదీ వరకు నడుస్తాయి. నర్సాపూర్-విజయవాడ, మచిలీపట్నం-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం, విజయవాడ-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.