ఆత్మీయ అభినందన సన్మాన సభ

ABN , First Publish Date - 2022-09-10T06:12:29+05:30 IST

నగరంలో జరగనున్న సీపీఐ నగర మహాసభకు నూతనంగా ఎన్నికైన నాయకులను 58వ డివిజన్‌ సీపీఐ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి వర్గ సభ్యుడు కేవీ భాస్కరరావు అధ్యక్షతన స్థానిక షాదీఖానాలో శుక్రవారం ఘనంగా సత్కరించారు.

ఆత్మీయ అభినందన సన్మాన సభ
సన్మాన కార్యక్రమంలో శంకర్‌

ఆత్మీయ అభినందన సన్మాన సభ

అజిత్‌సింగ్‌నగర్‌, సెప్టెంబరు 9 : నగరంలో జరగనున్న సీపీఐ నగర మహాసభకు నూతనంగా ఎన్నికైన నాయకులను 58వ డివిజన్‌ సీపీఐ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి వర్గ సభ్యుడు కేవీ భాస్కరరావు అధ్యక్షతన స్థానిక షాదీఖానాలో శుక్రవారం ఘనంగా  సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి  శంకర్‌ మాట్లాడుతూ అక్టోబరులో నగరంలో జగరబోయే సీపీఐ జాతీయ మహా సభలకు ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం  చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు, రాష్ట్ర మహిళా సమాఖ్య నాయకురాలు దుర్గ భవాని, నగర మహిళా కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, తదితరులు పాల్గొన్నారు. 

Read more