డెంగీ దడ

ABN , First Publish Date - 2022-12-07T00:08:50+05:30 IST

భవానిపురానికి చెందిన ఆరేళ్ల పాప తీవ్ర జర్వంతో పాతాసుపత్రికి వచ్చింది. రక్తపరీక్షలు చేస్తే డెంగీ అని, ప్లేట్‌లెట్స్‌ శాతం తక్కువగా ఉందని వైద్యులు చెప్పారు. వెంటనే అడ్మిట్‌ అవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు.

 డెంగీ దడ

- పిల్లల్లో ప్లేట్‌లెట్స్‌ స్థాయిలు తగ్గుదల

- రక్తనిధి కేంద్రాలకు పరిగెడుతున్న తల్లిదండ్రులు

- ఫాగింగ్‌లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు

పటమటకు చెందిన నాలుగేళ్ల బాబు కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నాడు. రక్త పరీక్షలు చేయించుకుంటే డెంగీ అని తెలింది. ప్లేట్‌లెట్స్‌ శాతం కూడా తగ్గడంతో ఓ ప్రైవేటు రక్తనిధి కేంద్రంలో ప్లేట్‌లెట్స్‌ కొనుగోలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

భవానిపురానికి చెందిన ఆరేళ్ల పాప తీవ్ర జర్వంతో పాతాసుపత్రికి వచ్చింది. రక్తపరీక్షలు చేస్తే డెంగీ అని, ప్లేట్‌లెట్స్‌ శాతం తక్కువగా ఉందని వైద్యులు చెప్పారు. వెంటనే అడ్మిట్‌ అవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు.

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా డెంగీ వ్యాధి విజృభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 118 డెంగీ కేసులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. లెక్కలోకి రాని కేసులు చాలానే ఉన్నాయని తెలిసింది. దోమల సంఖ్య పెరుగుదలే ఓ ప్రధాన కారణం. పంచాయతీ, కార్పొరేషన్‌ అధికారులు దోమల నియంత్రణ కోసం ఫాగింగ్‌ చేయించాల్సి ఉన్నా ఎక్కడా ఫాగింగ్‌ చేస్తున్న పాపాన పోలేదు.

(విజయవాడ ఆంధ్రజ్యోతి) అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు సాధారణ జ్వరం అనుకుని మందుల షాపుల్లో మందులు వినియోగిస్తున్నారు. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో రక్తపరీక్షలు చేయించుకుంటున్నారు. నగరంలో ఎక్కువగా చిన్నపిల్లలు డెంగీ జ్వరాల బారినపడుతున్నారు. పిల్లల్లో ప్లేట్‌లెట్స్‌ స్థాయి పడిపోయి ప్రాణంతకం పరిణమిస్తోంది. ప్లేట్‌లెట్స్‌ కోసం కొంతమంది దాతాల సహాయం తీసుకుంటున్నారు. మరికొంతమంది రక్తనిధి నుంచి కొనుగోలు చేస్తున్నారు. దోమల బెడద ఎక్కువగా ఉంటుందని అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

పిల్లల్లో తగ్గుతున్న ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌

డెంగీ సోకిన చిన్నపిల్లల్లో ఎక్కువగా ప్లేట్‌లెట్స్‌ స్థాయిలు పడిపోతున్నాయి. దీంతో వారిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించాల్సి వస్తోంది. రక్తనిధిల్లో ప్లేట్‌లెట్స్‌ స్టోరేజ్‌ తక్కువగా ఉండటంతో అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జ్వరం సోకిన వెంటనే రక్తపరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరగడానికి అవసరమైన ఆహారాన్ని రోగికి అందించాలని చెబతున్నారు.

దోమల ఫాగింగ్‌ లేదు.

స్ర్టాం వాటర్‌ డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రపర్చకపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. వీటి నిర్వహణను కార్పొరేషన్‌ పూర్తిగా గాలికొదిలేసింది. దోమల నివారణకు ఫాగింగ్‌ చేయడమే మార్చిపోయింది. వారానికోసారి కూడా ఫాగింగ్‌ చేయడం లేదని అధికారులకు ఫిర్యాదులందుతున్నా వారు పట్టించుకోవడం లేదు.

Updated Date - 2022-12-07T00:08:52+05:30 IST