ఘనంగా ఎఫ్‌సీఐ ఇంటర్‌ డివిజన్‌ స్పోర్ట్సు మీట్‌

ABN , First Publish Date - 2022-03-05T06:10:00+05:30 IST

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) రీజియన్‌ కార్యాలయం అమరావతి పర్యవేక్షణలో డివిజన్‌ ఆఫీస్‌ విజయవాడ ఆధ్వర్యంలో రెండో ఇంటర్‌ డివిజన్‌ స్పోర్ట్సు మీట్‌ ఎంజీ రోడ్డులోని దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి.

ఘనంగా ఎఫ్‌సీఐ ఇంటర్‌ డివిజన్‌ స్పోర్ట్సు మీట్‌
విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న ఎఫ్‌సీఐ రీజనల్‌ జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ జోషి

ఘనంగా ఎఫ్‌సీఐ ఇంటర్‌ డివిజన్‌ స్పోర్ట్సు మీట్‌ 

భవానీపురం, మార్చి 4 : ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) రీజియన్‌ కార్యాలయం అమరావతి పర్యవేక్షణలో డివిజన్‌ ఆఫీస్‌ విజయవాడ ఆధ్వర్యంలో  రెండో ఇంటర్‌ డివిజన్‌ స్పోర్ట్సు మీట్‌ ఎంజీ రోడ్డులోని దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల పాటు సాగే ఈ పోటీలను ఎఫ్‌సీఐ రీజనల్‌ జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ జోషి ప్రారంభించారు.  షటిల్‌ బ్యాడ్మింటన్‌ , టేబుల్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, చెస్‌ పోటీల్లో 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని తలపడ్డారు. డీజీఎంలు కె. జయప్రసాద్‌, ఎం. శ్రీనివాసరావు, ఏజీఎం ఆగస్టీన్‌, క్లింటన్‌లు పాల్గొన్నారు.

విజేతలు వీరే... షటిల్‌ సింగిల్స్‌లో వి.వంశీకుమార్‌ రెడ్డి(కర్నూలు) ఎం. వెంకటరమణ(కాకినాడ), చైతన్య(వైజాగ్‌), నాగార్జున(అనకాపల్లి)లు విజేతలుగా నిలిచారు. షటిల్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో కె. ప్రతిమా కుమారి(విజయవాడ), బి.నీలిమా(తాడేపల్లిగూడెం), ప్రియాంక(కర్నూలు), షీలారత్నం (తాడేపల్లిగూడెం), షటిల్‌ పురుషుల డబుల్స్‌లో ఎం.రమణ, డి.అమరనాథ్‌(కాకినాడ), చైతన్య, ప్రవీణ్‌(వైజాగ్‌), నాగార్జున, కరుణాకర్‌(అమరావతి),వంశీరెడ్డి, నరేష్‌ రెడ్డి(కర్నూలు) వరుస నాలుగు స్థానాల్లో నిలిచారు. క్యారమ్స్‌ సింగిల్స్‌లో పి.రాజా, ప్రసాద్‌, నాగ రాజారావు, ఎం. రాజేష్‌లు, మహిళల విభాగంలో గీతా కిరణ్మయి, చందన, జ్యోతిలు విజేతలుగా నిలిచారు. 

Updated Date - 2022-03-05T06:10:00+05:30 IST