చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

ABN , First Publish Date - 2022-07-01T06:29:47+05:30 IST

కులం అభివృద్ధి...మతం అభివృద్ధి.... ఆ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి
పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, తదితరులు

చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

కంకిపాడు, జూన్‌ 30 : కులం అభివృద్ధి...మతం అభివృద్ధి.... ఆ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లు అభివృద్ధి చేయాలంటూ మండలంలోని ఉప్పలూరు రైల్వే స్టేషన్‌ నుంచి మంతెన, తెన్నేరు, కోమటిగుంట, జగన్నాధపురం మీదుగా కోమటిగుంట లాకు వరకు గురువారం ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ ఐదేళ్ల టీడీపీ హయాంలో ప్రతి నెల రెండు మూడు సార్లు మీ ముందుకు వచ్చి మీ అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకోవడం జరిగేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా వచ్చారా...ఎక్కడైనా కనిపించారా అని అన్నారు. మూడేళ్ల క్రితం టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ మూడేళ్లలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్నారు. మాజీ జడ్పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్‌, పెనమలూరు, కంకిపాడు టీడీపీ నాయకులు సుదీమళ్ల రవీంద్ర, అనుమోలు ప్రభాకర్‌, అన్నే ధనయ్య, కొణతం సుబ్రహ్మణ్యం, కుర్రా నరేంద్ర, కొండవీటి శివయ్య, ఉద్దండి కుటుంబరావు, వణుకూరు విక్రం, వెంకట్‌, నాదెళ్ల సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, కుమార్‌, సుచిత్ర, శివపార్వతి, రత్నకుమారి, విజయలక్ష్మి, కళ్యాణి, వెంకటేష్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T06:29:47+05:30 IST